ఇజ్రాయెల్-హమాస్ మధ్య సంధి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణపై ఇరు పక్షాలు ముందడుగు వేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న 70 మంది బందీలను విడిచి పెట్టేందుకు హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ సైతం తమ వద్ద ఉన్న పాలస్తీనా మహిళలు, యువత 70 మందిని విడుదల చేసేందుకు సిద్ధమైంది. గాజాలో మరో 5 రోజుల పాటు దాడులు చేయబోమని ఇజ్రాయెల్ హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.