2028 నాటికి 32.96 ట్రిలియన్ డాలర్లతో అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తొలిస్థానంలో ఉంటుందని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంచనా వేసింది. భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, భారత ఆర్థిక వ్యవస్థ 5.94 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపింది. అలాగే 23.61 ట్రిలియన్ డాలర్లతో చైనా 2వ స్థానంలో ఉండగా, జర్మనీ 5.46, జపాన్ 5.16, బ్రిటన్ 4.58 ట్రిలియన్ డాలర్లతో 4, 5, 6 స్థానాల్లో ఉన్నాయి.