వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ముఖ్యమంత్రి వ్యవసాయ అధికారులు, కలెక్టర్లతో రైతు సమస్యలపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. కార్యక్రమంలో టిడిపి నేత కొండారెడ్డి, అర్కటవేముల కృష్ణారెడ్డి, పర్లపాటి మహేశ్వర్ రెడ్డి, ఘంటసాల వెంకటేశ్వర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.