కొత్తపాలెం రేషన్ షాపు నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నారు. లారీలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ముద్రలు కలిగిన 85 బస్తాలు (42. 30 క్వింటాళ్లు) రేషన్ బియ్యం లభించాయి. లారీ డ్రైవర్, ఓనర్ షేక్ జానీభాషాను విచారించగా. గాడిబోయిన రాజు చెప్పడంతో బియ్యాన్ని తరలిస్తున్నట్టు వెల్లడించాడు. కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లయిస్ డీటీ అరుణాదేవి తెలిపారు.
![]() |
![]() |