సీఎం జగన్ బీసీల ద్రోహి అని టీడీపీ స్టేట్ చీఫ్ అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని 21 బీసీ కులాలకు భౌగోళిక పరిమితులు రద్దు చేయడమంటే వారి వెన్నెముక విరిచినట్లేనని అన్నారు. జీవనోపాధి కోసం పక్క ప్రాంతాలకు వెళ్లేవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో 21 బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. విద్య, వైద్యం, రాజకీయంతో పాటు అన్ని విధాలా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.