కళింగపట్నం- పాతపట్నం 326 ఎ జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా జలుమూరు మండలం చల్లవానిపేట వద్ద రహదారికి ఇరువైపులా ఇళ్లు, స్థలాలు నష్టపోయిన వారికి నిధులు మంజూరయ్యాయని డీటీ డి. శ్రీనివాసరావు అన్నారు. బుధవారం కొలతలు వేసిన ఆయన మాట్లాడుతూ నష్ట పరిహారానికి సంబంధించి జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. చిన్నదూగాం కూడలి, సారవకోట మండలం గొర్రెబంద వద్ద కూడా నష్టపోయిన వారికి పరిహారం నిధులు మంజూరైనట్లు తెలిపారు.