దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ తీవ్రస్థాయిలో కాలుష్యం పెరుగుతోంది. బుధవారం నగరంలో కాలుష్యంతో కూడిన పొగమంచు దట్టంగా కమ్ముకుంది. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) ఉదయం 8 గంటల సమయంలో 392కి చేరుకుంది. ఆర్‌కే పురం (422), పంజాబ్ బాగ్ (432), ఐజీఐ విమానాశ్రమం (404), ద్వారక (416), రోషిణి (421), ఆనంద్ విహార్ (430), నెహ్రూ నగర్ (434)గా ఉంది. ఇది పీల్చడం రోజుకు 10 సిగరెట్లు కాల్చడంతో సమానమని వైద్యులు అంటున్నారు.