అండమాన్ నికోబార్ దీవుల వద్ద బంగాళాఖాతంలో గురువారం వాయుగుండం ఏర్పడిందని గోపాల్పూర్ వాతావరణ అధ్యాయన కేంద్రం తెలిపింది. విశాఖపట్నానికి దక్షిణ, తూర్పు దిశలో 510 కిలో మీటర్లు, పరదీప్కు 650 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుని ఒడిశాకు చేరువయ్యే సూచనలు ఉన్నాయన్నారు. దీని ప్రభావం వల్ల వేగంగా గాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు గోపాల్పూర్, ధమ్రా, పరదీప్ ఒడరేవులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.