హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ రోజు జరిగిన టీడీపీ – జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉందన్నారు.. నేను , పవన్ కల్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడుతాం అన్నారు. ప్రజా ఉద్యమంలో పాల్గొనడానికి నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు.. టీడీపీ-జనసేన కలయిక కొత్త శకానికి నాంది పలికుతుందన్న ఆయన.. రాష్ట్ర మొత్తం ఇన్ని సీట్లు అన్ని సీట్లు కాదు.. మొత్తంగా టీడీపీ , జనసేన గెలవాలని పిలుపునిచ్చారు..
ఇక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు బాలకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు.. రాష్ట్రంలో పరిపాలన మొత్తం నేరస్తులు, హంతకుల చేతిలో ఉందన్నారు. ప్రజాస్వామ్య సంరక్షణ అందరూ కలిసి పోరాటం చేయాలి.. పరిపాలన ఇష్టరాజ్యంగా సాగుతుంది.. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేయడం లేదు.. ఒక హిందూపురంలో తప్ప అని.. ప్రతిపక్షంలో ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నాం అని వెల్లడించారు.
ఒక సిమెంట్ రోడ్డు గానీ, ఒక గొయ్యికి తట్టెడు మట్టడు కానీ పోయలేదు, తట్టేడు మట్టికాని తీయలేదని విమర్శించారు. పరిపాలన చేతకాక మూడు రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారు.. పెయిడ్ ఆర్టిస్టులతో పారిశ్రామిక సదస్సులు నిర్వహించారు. కానీ, రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాలేదు అని ఆరోపించారు. ఆరోగ్య ఆస్పుత్రులకు బకాయి పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. డబ్బులు ఇచ్చి సలహాదారులను పెట్టుకున్నాడు అని విమర్శించారు.. గడపగడపలో పార్టీలకు అతీతకంగా ప్రజలు నిలదీస్తున్నారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.