ఏపీలో ఓటర్ల జాబితాను తనిఖీ చేసేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. ఎలక్ట్రోరల్ అబ్జర్వర్లు వారికి కేటాయించిన జిల్లాల్లో 3 సార్లు పర్యటించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటరు జాబితాపై అభ్యంతరాల గడువు పూర్తయ్యే డిసెంబర్ 9లోపు తొలి విడత పర్యటించాలని.. అలాగే పార్టీల ప్రతినిధులతో భేటీ కావాలని సూచించింది. డిసెంబర్ 26లోపు రెండో విడత, జనవరి 4లోపు లిస్ట్ తుది తనిఖీ కోసం మూడోసారి పర్యటించాలని తెలిపింది.