నాగులచవితికి పుట్టలో పాలుపోసేందుకు వెళ్లేముందు.. ముందుగా ఇంట్లో దేవుడికి దీపం పెట్టి నమస్కరించి.. చేసిన చలిమిడి, చిమ్మిలి, వడపప్పు , పండ్లు కొంత నైవేద్యం పెట్టి ఆ తర్వాత పుట్టదగ్గరకు వెళతారు. పుట్ట దగ్గర షోడసోపచార పూజలేమీ అవసరం లేదుకానీ అవకాశం ఉంటే నవగాన స్త్రోత్రం, సర్ప సూక్తం చదువుకుంటే మంచిదంటారు. పుట్టదగ్గర అంత సమయం ఉండనివ్వరు కదా అనుకుంటే.. ఇంట్లో దీపం పెట్టేటప్పుడు చదువుకుని పుట్ట దగ్గరకు వెళ్లినా మంచిదే.