బెంగళూరులో ఆకతాయిలు నడి రోడ్డుపై ఓ మహిళ వెంటపడి అల్లరి చేశారు. ఈ ఘటన గురించి తెలుపుతూ తన భార్య పట్ల కొందరు ప్రవర్తించిన తీరుపై ఆమె భర్త ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి 10 గంటలకు డ్యూటి నుండి బయటకు వచ్చిన ఆమె తన సహోదోగ్యుల కారులో బయలుదేరింది. వారిని గమనించిన కొందరు దుండగులు మరో వాహనంలో ఆమె కారును వెంబడించి ఢీకొట్టారని తెలిపాడు. కారును ఆపాలంటూ వీరంగం సృష్టించారని, దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేశారన్నారు.