బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు. బిహార్ అభివృద్ధి పథంలో సాగాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి మద్దతు ఇవ్వని వారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే వారని ఆయన అభివర్ణించారు. ప్రత్యేక హోదా కోసం జేడీయూ ఎన్నో ఏళ్లుగా పోరాడుతుందన్నారు.