నేడు మధ్యప్రదేశ్ 230 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుండి ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో 11.95శాతం ఓటింగ్ పూర్తయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుపమ్ రాజన్ తెలిపారు. ఎక్కడా ఓటింగ్‌కు అంతరాయం కలగదని, అన్ని చోట్లా ఓటింగ్ జరుగుతుందని, ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఎక్కడ సమస్యలున్నా వెంటనే వాటిని మార్చారు.