ఏలూరు జిల్లా నూజివీడులో సీఎం జగన్ భూ యాజమాన్య హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాసేపట్లో అసైన్డు, లంక భూముల రైతులకు పట్టాలు సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించనున్నారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేయనున్నారు.