ఓటరు లిస్ట్ కన్నా వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టే ఎక్కువని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ధూళిపాళ్లపై అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ నేతలపై వందల అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు? అని ప్రశ్నించారు. సంగం డెయిరీ ఆక్రమణకు వైసీపీ విశ్వప్రయత్నం చేసిందని ఆరోపించారు.