నేడు మధ్యప్రదేశ్ 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుండి ఇప్పటివరకు మధ్యప్రదేశ్లో 11.95శాతం ఓటింగ్ పూర్తయింది. ఇంతలోనే ఖర్గోన్ జిల్లా రుప్ఖేడాలో పోలింగ్ స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రుప్ఖేడాలో పోలింగ్ స్టేషన్ వెలుపల క్యూలో నిలబడిన భుర్లీ బాయి (53) గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందింది.