నేడు మధ్యప్రదేశ్ 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. నాకు సీఎం కుర్చీ ముఖ్యం కాదని అన్నారు. ఎవరు ఎక్కడ పని చేయాలో మా పార్టీ నిర్ణయిస్తుంది. మేము మా గురించి ఆలోచించమని, దేశాభివృద్ధి , మధ్యప్రదేశ్ అభివృద్ధే మా లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఈ పోలింగ్ లో బీజేపీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ సాధించబోతోందని వెల్లడించారు.