వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. పోలీసులు, ప్రభుత్వ పెద్దలే పట్టించుకోకపోతే ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలని ప్రశ్నించారు. హక్కులు పరిరక్షించాల్సిన వారి నుంచే సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఓటు వేసేటప్పుడు ఎవరు మంచి చేస్తారో ఆలోచించి వేయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై ఎన్ని దాడులు జరిగాయో లెక్కలేదన్నారు.