హర్యానాలోని నూహ్ జిల్లాలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అల్లరిమూకలు జరిపిన రాళ్ల దాడుల్లో ఎనిమిది మంది మహిళలు గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎనిమిది మహిళలు ఇంటికి వెళ్తుండగా.. అల్లరిమూకలు వారిపై రాళ్లదాడి చేశారు. నిందితులను గుర్తించడం జరిగిందని, ఆందోళన చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు.