స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వంలో భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి పేదవాడిని గుండెల్లో పెట్టుకుని, ముందుకు నడిపించే కార్యక్రమం ఈ 53 నెలల పాలనలో జరిగింది. పేదవారిపై ప్రేమ చూపిస్తూ నేనెప్పుడు మాట్లాడినా ఆ మాటలు పెత్తందారులకు నచ్చవు. కానీ మన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవకుండా పేదల పట్ల ఎంత చిత్తశుద్ధితో.. బాధ్యతతో వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ రోజు జరుగుతున్న కార్యక్రమమే నిదర్శనం’’ అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.