విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పారు. దక్షిణ మధ్య రైల్వేలో రద్దీగా ఉండే విజయవాడ-విశాఖ మధ్య ప్రస్తుతం ఉన్న రెండు లైన్లకు అదనంగా.. మరో రెండు లైన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మరో ఆరు నెలల్లో డీపీఆర్‌ను పూర్తి చేస్తామన్నారు. రైల్వే డివిజన్ పరిధిలో ప్రస్తుతం విజయవాడ, గుణదల సహా పలు స్టేషన్ల అభివృద్ధి వేగవంతంగా సాగుతోందన్నారు.