కరోనా వైరస్ ఇప్పుడు విభిన్న రూపాల్లోకి మారుతోంది. ప్రస్తుతం ఇది బ్రిటన్‌లో బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారత్‌లో కూడా ఉండనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనాలో ఉండే అన్ని లక్షణాలు ఈ వేరియంట్‌లో ఉంటాయని, అలాగే ఇది శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని తెలుపుతున్నారు. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, మాస్క్ ధరించాలని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.