మరమ్మతులకు కేంద్రం సిద్ధమన్నా ఏపీ ప్రభుత్వం సహకరించట్లేదని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడలో దెబ్బతిన్న రహదారులకు నిరసనగా ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ పేరుతో టీడీపీ - జనసేన ఆందోళన చేపట్టారు. ఈ మేరకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రామ్మోహన్ రోడ్లను పరిశీలించారు. నిధులు లేవంటూ రహదారుల అభివృద్ధిని విస్మరించారని.. రాష్ట్రమంతా గుంతలమయమైందని అన్నారు.