ఉత్తరాఖండ్లో కూలిన టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 140 గంటలుగా కార్మికులు ఆ టన్నెల్లోనే ఉండిపోవడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఉదయం సహాయక చర్యలను తిరిగి ప్రారంభించినప్పుడు భారీ శబ్దాలు వినిపించినట్టు సమాచారం. డ్రిల్లింగ్ని కొనసాగిస్తే టన్నెల్ ఇంకా కూలిపోయే ప్రమాదం ఉందని భావించిన అధికారులు సహాయక చర్యలను నిలిపివేసినట్టు తెలుస్తోంది.