రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలికేందుకు జనసేన, టీడీపీ సమష్ఠిగా పనిచేయాలని జనసేన పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మల బాబు పిలుపునిచ్చారు. అయన మాట్లాడుతూ...... రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి రెండుపార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలన్నారు. తమ అధినేత పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు టీడీపీతో కలిసి పనిచేస్తామన్నారు. అనంతరం పెద్దాపురం వెంకటేశ్వర రైస్ మిల్లునుంచి ర్యాలీగా రహదారుల దుస్థితిని ప్రజలకు తెలియచేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వ హించారు.