ఇసుక అక్రమాలపై బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. కడియం మండలం బుర్రి లంక ఇసుక ర్యాంపులను జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తో కలిసి పరిశీలించారు. ఇసుక ర్యాంపుల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల ధవళేశ్వరం బ్యారేజ్ తో పాటు పర్యావరణానికి ముప్పు ఉందన్నారు. కంపెనీ పేరు లేకుండా బిల్స్ ఉన్నాయని, ఢిల్లీలో ఉన్న వారి పేరుతో ఇక్కడ తవ్వకాలు ఇల్లీగల్ గా జరుగుతున్నాయని ఆరోపించారు.