రానున్న ఎన్నికల్లో బీసీ జనాభాను అనుసరించి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం లాకా వెంగళరావు యాదవ్ పిలుపునిచ్చారు.అయన మాట్లాడుతూ.... డిసెంబరు 7 వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మొదలై రాయలసీమలోని తడ వరకు రథయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీసీ సంఘాల తరుపున పోరాడుతున్నా, ఫలితం వచ్చేది అంతంత మాత్రమేనన్నారు. రాజకీయ ఆధారం బీసీలకు లేకుండా పోయిందని, ఈ క్రమంలోనే బీసీలు ఎక్కడ వేసిన గొంగళి అన్న చందన ఉండిపోయారన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమ స్యలు, రాజ్యాధికారమే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాఫురం నుంచి బీసీ పోరాట రథయాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ రథయాత్రలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.