కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంలో భాగంగా నిర్వహించే ‘విక్‌సిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ విశాఖపట్నం , పాడేరు , జిల్లాలోని 16 మండలాల్లో నిర్వహిస్తారని కలెక్టర్ సుమిత్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అరకులోయలో ఈనెల 15వ తేదీన గవర్నర్ అబ్దుల్ నజీర్ లాంఛనంగా ప్రారంభించిన ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ వరకు జిల్లాలో కొనసాగుతుందన్నారు. ఈ యాత్ర నిర్వహణ కోసం జిల్లాకు మూడు వాహనాలను కేటాయించారని, ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా విశాఖపట్నం పోర్టు అథారిటీ డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్‌కుమార్ దూబే వ్యవహరిస్తారన్నారు. పాడేరు మండలంలో 26 గ్రామాల్లో, జీకేవీధిలో 16, కొయ్యూరులో 22, చింతపల్లిలో 17, అనంతగిరిలో 24, అరకులోయలో 14, ముంచంగిపుట్టులో 23, పెదబయలులో 23, హుకుంపేటలో 33, రంపచోడవరంలో 19, మారేడుమిల్లిలో, 12, రాజవొమ్మంగిలో 19, అడ్డతీగలలో 22, వై.రామవరంలో 17, దేవీపట్నంలో 14, గంగవరంలో 17 గ్రామాల్లో ‘విక్‌సిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.