జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్. ఏపీలో భారీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు పెప్పర్ మోషన్ జీఎంబీహెచ్ ప్రకటించింది. ఈ సంస్థకు ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా పుంగనూరులో 800 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా 8,080 మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు