అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మద్యం దుకాణాలు రద్దు చేస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 'ఫైవ్‌స్టార్ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఫుడ్ డెలివరీ లాగా మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. నాసిరకమైన మద్యాన్ని అమ్ముతున్నారు' అని ఆయన అన్నారు.