ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కార్మికులు టన్నెల్లో చిక్కుకుని ఆరు రోజులైంది. థాయ్‌లాండ్, నార్వేకు చెందిన ఎలైట్ రెస్క్యూ బృందాలతో పాటు అమెరికన్ ఆగర్ మిషన్‌ను రంగంలోని దింపారు. ఇప్పటివరకు 24 మీటర్ల వరకు శిథిలాలను అధికారులు తొలగించారు. నాలుగు పైపుల ద్వారా టన్నెల్లో ఉన్న కార్మికులకు ఆహారం, నీరు, ఆక్సిజన్ అందిస్తున్నారు.