అహ్మదాబాద్ వేదికగా నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మెగా ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్కు ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రులు, ఆర్బీఐ గవర్నర్, ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇతర రాష్ట్రాల న్యాయస్థానాల న్యాయమూర్తులు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరుకానున్నారు. అంతేకాకుండా హీరోలు వెంకటేష్, రామ్చరణ్, అల్లు అర్జున్ కూడా స్టేడియంలో కనిపించనున్నారు.