వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పురంధేశ్వరిపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘చంద్రబాబుకు అనారోగ్యం, బెయిల్ షరతులు సరే..పార్టీలో లోకేష్, భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు?. తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా?లేక టీడీపీ భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టారా? ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావచ్చేమో కానీ బావగారి పార్టీ టీడీపీని బతికించడంలో కాదు సుమా!’’అంటూ ట్వీట్ చేశారు.