తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు ఖుష్బూ మండిపడ్డారు. గవర్నర్ తిప్పిపంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశంలో ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని? ప్రశ్నించారు. డీఎంకే పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్ పేరుతో ఆ పార్టీ కపటనాటకమాడుతోందని విమర్శించారు. సీఎం, మంత్రులు నివాసమున్న ప్రాంతాల్లో మినహా.. రాష్ట్రంలో రహదారులన్నీ అధ్వానంగా ఉన్నాయన్నారు.