రాజకీయ, విద్యా, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలు తగ్గాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడ పటమట సెంటర్లో PVR మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యం వ్యాపారం కాదు ఇదొక సేవ కార్యక్రమన్నారు. వైద్యుడిని దేవుడి తరువాత దేవుడిగా ప్రజలు కొలుస్తారని, అలాంటి వైద్యులు అంకితభావంతో వైద్య సదుపాయాలు కలిపించాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.