కార్తీక మాసం సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల భద్రత కోసం ఏర్పాట్లు చేపట్టారు. బాపట్ల డిఎస్పీ వేంకటే శులు ఆదివారం బాపట్ల సూర్యలంక తీరంలో పోలీసు భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా గజ ఈతగాళ్లు ను సిద్దం చేశారు. వాహనాల పార్కింగ్, సమాను పెట్టుకునేందుకు గదులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెరైన్, రూరల్ సీఐలు సుబ్బారావు, వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై కొండా రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.