మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ఉన్న ఎయిర్‌పోర్టును అధికారులు మూసేశారు. ఎయిర్‌పోర్టుకు సమీపంలో గుర్తుతెలియని డ్రోన్ కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం గగనతలంలో గుర్తుతెలియని డ్రోన్ కనిపించింది. దీంతో విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే 2 విమానాలను కోల్‌కతాకి డైవర్ట్ చేయగా మరో మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ చిపెమ్మి కీషింగ్ డ్రోన్ చూసినట్లు ధృవీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa