వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.... నాలుగున్నరేళ్ల జగనన్న పాలనలో సామాజిక సాధికారత సాధించాం. సామాజిక న్యాయం అనేది కేబినెట్‌లోనే కాదు.. కింది స్థాయిలో ఉన్న ప్రతి కుటుంబంలో జరిగింది. జ్యోతిరావు పూలే ఆలోచనలతో, జగ్జీవన్ రామ్ పరిపాలన దక్షతతో జగనన్న చక్కటి పాలన అందిస్తున్నారు. గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా అమ్మ ఒడి పథకం ఉందా? మన బిడ్డల్ని చదివించేందుకు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరు ముద్ద, నాడు-నేడు ద్వారా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓటు హక్కులేని పిల్లల కోసం కూడా వేలాది కోట్లు ఖర్చు చేస్తున్న జగనన్న. అప్పుల భారం ఉన్నా, కరోనా విపత్తుతో అధిక భారం పడినా వెనుకంజ వేయకుండా ప్రతి హామీని నెరవేర్చారు.రాష్ట్రంలో పేదరికాన్ని 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు అని తెలియజేసారు.