వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ... రామోజీరావు సామాజిక వైఫల్య యాత్ర అని పేపర్లో రాశాడు. ఒక్కసారి తణుకు రా రామోజీ. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలంటే, కాపులంటే రామోజీ, రాధాకృష్ణకు ఎందుకంత కడుపుమంట? జనం లేరని పేపర్లలో రాస్తున్నారు. మా వర్గాల పట్ల మీకున్న బుద్ధిని, మీ పేపర్లో రాసే రాతలే స్పష్టంగా చెబుతున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో 28 రాష్ట్రాల్లో సామాజిక సాధికారతను, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. 14 సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా సామాజిక ధర్మాన్ని పాటించారా? దళిత మహిళను హోంమంత్రిని చేసిన ఘనత జగనన్నది. 2014 మేనిఫెస్టోని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏం చేశారు? దీనికి సమాధానం చెప్పిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేయండి. బీసీలు, మైనార్టీలకు ఏమీ చేయని సన్నాసులు చంద్రబాబు, పవన్. మా విజయాన్ని ఎవరూ ఆపలేరు. 2024లో 175 సీట్లూ గెలవబోతున్నాం అని ఆశాభావం వ్యక్తపరిచారు.