వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ... మన జీవితాల్ని చిన్నచూపు చూసిన చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నా వాళ్లు అన్న జగనన్న. మన ఆకలి డొక్కలను పాదయాత్రలో చూసిన జగనన్న. పేదవాళ్లంతా అలసిపోయారు, వాళ్ల పల్లకీ మనం భుజాన మోయాలని గొప్ప పాలన చేస్తున్న జగనన్న. అప్పుడున్న బడ్జెట్ ఒకటే, ఇప్పుడూ ఒకటే. అప్పుడు సంపద ఏమైందని అడిగితే సమాధానం లేదు. ఈ నాలుగున్నరేళ్లు సంపద పేద వాళ్ల అకౌంట్లలో వేసిన దమ్మున్న నాయకుడు జగనన్న. చంద్రబాబు మనవడు ఇంగ్లీషు మీడియం చదవొచ్చు, పేద పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవొద్దని కోర్టుకు వెళ్లాడు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం తాడేపల్లివైపు చూపుతుంటుంది. నా ఆశలు, మీ జీవితాలు తెలిసిన వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని చూపుతున్నట్లు అనిపిస్తుంది. పేదవాడు పార్లమెంటుకు వెళ్లేలా చేసిన ఘనత జగనన్నది అని అన్నారు.