వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా శాసనమండలి చైర్మన్‌మోషేన్ రాజు, మాట్లాడుతూ.. సాధికారత అంటే గతంలో కొన్ని పార్టీలకు అది ఒక నినాదం. కానీ జగనన్న ప్రభుత్వానికి ఇది ఒక విధానం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద వారిని సమానంగా చూడాలని, పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం పని చేస్తోంది. అంబేద్కర్ ఆలోచన విధానాలతో సమాజంలో ఎస్సీలు, బీసీలు, పేద వర్గాలు, రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్న జగనన్న. దళిత వర్గానికి చెందిన నన్ను శాసనమండలి చైర్మన్‌గా చేసిన ఘనత సీఎంది.