వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.... భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సామాజిక సాధికారత పెద్ద విషయం కాదు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న సామాజిక సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీల కులగణనకు అంగీకరించిన జగనన్న.. బీసీలందరికీ న్యాయం చేయాలని భావిస్తున్నారు. వెనుకబడిన వర్గాల వారు నేడు ఆత్మగౌరవంతో.. తలెత్తుకు తిరుగుతున్నారంటే అది జగనన్న చలవే. చంద్రబాబు హయాంలో మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని చులకనగా చూశారు. అవహేళన చేశారు. అవమానాల పాలు చేశారు. నేడు జగనన్న పాలన మంచికి, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. మహిళా సాధికారత విషయంలోనూ జగనన్న చేస్తున్న మంచి అంతా ఇంతా కాదు అని తెలిపారు.