వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.... ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసింది జగనన్నే. మన తలరాతలు మారుస్తోంది జగనన్నే. అట్టడుగు వర్గాలకు చెందిన మనకు నాయకులయ్యే అవకాశం జగనన్న వచ్చాకే వచ్చింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు రాలేదు. మన రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రం జగనన్న వచ్చాకే స్వాతంత్య్రం వచ్చింది. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలంతా.. నా మనుషులు అంటూ ఆయా వర్గాలను జగనన్న సొంతం చేసుకున్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన వారిని పైకి తెచ్చే నాయకుడు జగనన్నే. ఈరోజు పింఛన్లు అందుకుంటున్నవారు జగనన్నను పెద్దకొడుకులా చూస్తున్నారు అని అన్నారు.