వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.... సామాజిక సాధికారత జగనన్న వల్లే సాధ్యమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలిచి, అధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. సంక్షేమ పథకాల వెల్లువతో బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపారు. జగనంటే జనం.. జనమంటే జగన్. గతంలో మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినవాళ్లు, మంత్రులైన వారున్నారు. చేసింది మాత్రం ఏమీ లేదు. ఇక్కడ సాగునీటి కోసం జగనన్న చేసిన మేలు అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి జిల్లాకు చెందిన నలుగురికి ఛైర్మన్ పదవులు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 440 డైరెక్టర్లలో కర్నూలుకు 32 ఇచ్చారు. ఇందులో 18 అంటే 50 శాతానికి మించి పోస్టులు బడుగు, బలహీన వర్గాలకు కట్టబెట్టారు. నామినేటెడ్ పదవుల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ, డీసీఎంఎస్‌తో పాటు 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయా వర్గాల అభ్యర్థులను నిలిపి గెలిపించారు అని తెలియజేసారు.