ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యశ్రీని సగానికి తగ్గించేసిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2023, 09:23 AM

వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.... చంద్రబాబుకు సామాజిక వర్గం అంటే ఆయన సామాజికవర్గం. జగన్‌ గారికి సామాజిక వర్గం అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. ఒక అబద్ధం 14 ఏళ్లు పాలించింది. పేదవాడికి జబ్బు చేస్తే ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు అనుకోలేదు. మనపాలిట సంజీవని ఆరోగ్యశ్రీ, డబ్బున్నోడికి జబ్బు చేస్తే డబ్బు కట్టాలి. పేదోడికి జబ్బు చేస్తే గవర్నమెంట్‌ ఆస్పత్రిలో డబ్బు కట్టక్కర్లేదు. ఆరోగ్యశ్రీని సగానికి తగ్గించేసిన చంద్రబాబు. ఏ బీసీ పిల్లాడైనా పది తర్వాత పెద్ద చదువు చదవాలంటే కష్టమయ్యేది. అలాంటి వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అనే వరం ఇచ్చింది వైయస్సార్‌. అమరావతిలో పేద వర్గాలుంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందన్న చంద్రబాబు. ఏ వివక్షతో చంద్రబాబు ఏ కులాలను చూశాడో, అవమాన పరిచాడో ఆ కులాలు నా కులాలన్న జగనన్న అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com