వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..... దేశ చరిత్రలో పేద ప్రజల కోసం ఆలోచించిన సీఎం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం ఆలోచించిన సీఎం.. బలహీన వర్గాల కుటుంబాలు బాగుండాలని కోరుకొనే సీఎం జగనన్న. ఆయన సీఎం అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల స్థితిగతులు మారాయి. ముందెన్నడూ లేని విధంగా ఈ కులాలు బాగుపడ్డాయి. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి, బీసీల తోకలు కత్తిరిస్తానన్న వ్యక్తి, బీసీలు జడ్జిలుగా పనికి రారన్న వ్యక్తి చంద్రబాబు. రూ.2.40 లక్షల కోట్లు పేద ప్రజలకు ఆశ్రిత పక్షపాతం లేకుండా, అర్హతే ప్రామాణికంగా ఇచ్చిన జగనన్న. ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందింది. 2.07 లక్షల ఉద్యోగాల్లో, ఇంటి పట్టాల పంపిణీలో, పేదవాడి చదువుల్లో అగ్ర తాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే. చంద్రబాబు, పవన్ కల్యాణ్ 648 వాగ్దానాలిస్తే, ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. మళ్లీ వస్తున్నారు. జగనన్న రాష్ట్రంలో పేద ప్రజల గుండె చప్పుడు. అలాంటి సీఎంను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.