వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.... ఎన్నికల ముందు చెప్పినవి, చెప్పనివి కూడా అమలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి. వాలంటీర్లను తెచ్చి సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేస్తున్నారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా, నాడు–నేడు స్కూళ్ల ద్వారా రూ.65 వేల కోట్లు ఖర్చు చేసి పిల్లలకు ఇంగ్లీషు మీడియం సహా గొప్ప చదువులు చెప్పిస్తున్నారు. రూ.65 వేల కోట్లు పెద్దవాళ్లకు ఖర్చుపెడితే ఓట్లు వస్తాయని కొందరు అంటే, నాకు ఓట్లు ముఖ్యం కాదన్న జగనన్న. రాష్ట్రమంతా పేదవాళ్ల ఆరోగ్యం గురించి ఆలోచన చేసి జల్లెడ పట్టి ఆరోగ్య సురక్ష తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. పక్కరాష్ట్రాలు, భారత దేశమంతా ఏపీవైపు చూసేలా పాలన. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత జగనన్నదే. నా నియోజకవర్గంలో రూ.2,800 కోట్లకుపైగా సంక్షేమం, అభివృద్ధి చేసిన ఘనత జగనన్నదే అని అన్నారు.