వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.... ఎవరి పేరు చెబితే చంద్రబాబుకు, లోకేష్‌కు దిమ్మ తిరిగి మైండ్‌బ్లాంక్ అవుతుందో ఆ పేరు జగనన్న. రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి చంద్రబాబు నిలబెట్టుకోలేదు. మహిళలకు డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు. మీ బంగారం బ్యాంకుల్లో నుంచి విడిపించలేదు. బాబొస్తే జాబొస్తుందని మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఎంత మందికి ఇచ్చాడు? నమ్మించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికాడు. చంద్రబాబు దిగిపోతూ ఖజానాలో మిగిల్చింది కేవలం రూ.100 కోట్లే. పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే రూ.8500 కోట్లు అవుతుంది. రూ.వంద కోట్లు మిగిల్చి రూ.2 లక్షల కోట్లతో అమరావతి ఎలా కడతాడు? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నామైనార్టీ అంటూ 67 శాతం మందిని మంత్రులను చేసిన జగనన్న. చంద్రబాబు ఒక్క బీసీనైనా, ఎస్సీనైనా, మైనార్టీనైనా రాజ్యసభకు పంపాడా? రూ.100 కోట్లు, 200 కోట్లకు ఆ సీట్లు అమ్ముకున్నాడు. జగనన్న బటన్ నొక్కుతున్నాడు. మీ అందరికీ లక్షల రూపాయలు వచ్చాయి. రేపు పోలింగ్ స్టేషన్లో ఫ్యాను గుర్తుకు మనమంతా బటన్ నొక్కుదాం అని పిలుపునిచ్చారు.