భర్త వేధింపులు తాళ లేక భార్య ఎలుకలు మందు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ప్రకారం. సంఘం గోపాలపురానికి చెందిన ప్రసన్న (24)కు ఏడుకొండలుతో వివాహమైంది. కొన్నేళ్లుగా దంపతుల మధ్య కుటుంబ కలహాలతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపంతో 14న ప్రసన్న ఎలుకల మందు తినింది. కుటుంబ సభ్యులు గుంటూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.